Posts

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 3

Image
3.1  గ్రామ వృక్షాలు              గ్రామ నిర్మాణంలో బొడ్డురాయి కూడలి తరువాత మరో ప్రధానమైన సంగమ స్థానం పడమర బజారు, బొడ్డురాయి బజారు రెండు కలిసే కూడలి.  ఒక నాడు ఈ కూడలిలో శ్రీ మహాలక్ష్మీ దేవి  అంశగా పూజలు అందుకొనే పెద్ద వేప చెట్టు ఉండేది. ప్రతి శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడన్న వేప చెట్టుని  పసుపు కుంకుమలతో పూజించేవారు. పకృతి ఆరాధనలో వృక్షారాధన ఒకటి. చల్లటి నీడను, ఆరోగ్యకరమైన గాలిని ప్రసాదించే వేప చెట్టు అమ్మ తల్లిగా భావించేవారు. ఇప్పుడు అక్కడ వేప చెట్టు కనుమరుగైంది. అయినా కానీ ఇప్పటికి గ్రామ జనులు పెండ్లి వంటి శుభకార్యక్రమాలు జరుపుకునే సమయంలో ఆ కూడలిలో(వీధి మధ్యలో) ఒక వేప కొమ్మని మట్టి ముద్దలో నాటి దానినే శ్రీ మహాలక్ష్మీ దేవిగా తలుస్తూ పూజలు చేస్తున్నారు. కుదించుకుపోయిన ఆ ప్రదేశంలో కొత్తగా మరో చెట్టు నాటే వెసులుబాటు నేడు లేదు. కాలగతిలో ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో బలంగా ఏళ్ళూనుకొని ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు ఏదో రకంగా ఆనాలోచనతో కొనసాగుతాయని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.            ఈ పడమటి కూడలికి నైరుతి దిశలో విష్ణువాలయం నిర్మించాలని 'మానసారం' లో చెప్పబడింది.  ఈ సూత

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

Image
 2. 1  గ్రామ నిర్మాణం            దండక నామ గ్రామ ప్రణాళిక  (మానసారం)           వీరన్నపాలెం గ్రామ నిర్మాణం ప్రాచీన గ్రామ వాస్తును అనుసరిస్తూ నిర్మించబడినది. ఇది మానససారం అనే ప్రాచీన వాస్తు గ్రంథం లో చెప్పబడిన "దండక నామ గ్రామం" ను ప్రామాణికంగా తీసుకోని నిర్మించుకున్నారు.  మాయ మతం, శిల్ప రత్నం వంటి వాస్తు గ్రంథాలలోను దండకా నమ గ్రామ నిర్మాణం గురించిన వివరాలు ఉన్నాయి. ఈ గ్రామం ఆయతాకారం (దీర్ఘ చతురస్రాకారం) లో ఉండి వ్యవసాయం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రామంలో గరిష్టంగా ఒక వంద కుటుంబాలు నివసించవచ్చు. దీని ప్రణాళిక ప్రకారం తూర్పు - పడమర దిశలకు తిన్నగా ఒక ప్రధాన వీథి (సూర్య వీథి), దానికి లంబకోణంలో ఉత్తర - దక్షిణ దిశలకు ఉండే మూడు వీథులు  (చంద్ర వీథులు) ఉంటాయి. ఈ నాలుగు వీథులును అనుసంధానం చేస్తూ గ్రామ వెలుపల ఒక వీథి ఉంటుంది. దీనిని మంగళా వీథి (చుట్టు వీథి / రింగ్ రోడ్డు) అని అంటారు.  ఇది వీరన్న పాలెం ప్రాథమిక దశలో రూపొందించిన ప్రణాళిక.  2.2  ప్రధాన వీథులు             ఇప్పుడు బొడ్డు రాయి ఉన్న ప్రదేశంలో తూర్పు - పడమర దిశలకు నిలువుగా  ఉన్నది గ్రామ ప్రధాన వీథి లేదా రాజవీథిగా చెప్పవచ్చు

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 1

Image
1. గ్రామ ప్రాచీన చరిత్ర   ఈనాడు బాపట్ల జిల్లా పరుచూరు మండలంలో ఉన్న ఈ వీరన్న పాలెం ఉన్న ప్రాంతాన్ని ఒకనాడు తెలుగు చోడ, పలనాటి హైహయ రాజవంశాలు , కాకతీయ సామ్రాట్టులు, అద్దంకి రెడ్డి రాజులు, ఓఢ్ర గజపతులు, విజయనగర సామ్రాట్టులు పరిపాలించారు. రాక్షస తంగడి యుద్ధం తరువాత యీ సీమ కుతుబ్ షాహీలు, మొగలాయిలు, అసఫ్ జాహీల ఏలుబడిలో ఉండేది. అసఫ్ జాహీ (నిజాం రాజు) పాలన నుంచి సా.శ. 1788 లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి  ఈ ప్రాంతం బదలాయింపైనది. సా.శ.1858 లో పాలన కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొని మన దేశం వారి సామ్రాజ్యంలో భాగమయింది. ఈ కాలంలో మన ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ చాలా మార్పులు చెందింది. అసఫ్ జాహీల, పిమ్మట ఈస్టిండియా కంపెనీ/ బ్రిటిష్ సామ్రాజ్య పాలనలో స్థానిక పాలకులు జమీందారీ వ్యవస్థ ద్వారా స్థిరపడ్డారు. గోర్డెన్ మాకెన్ జి  వ్రాసిన  'కృష్ణా జిల్లా మ్యాన్యువల్ (1883)' ప్రకారం ఈ ప్రాంతం 1873 వరకు వేంకటగిరి జమీందార్ల ఆధీనంలో ఉంది. ఆ తరువాత బ్రిటీష్ వారి పాలనలో కృష్ణ జిల్లాలో భాగంగా ఉంటూ 1904లో గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో భాగమైంది. 1970 లో బాపట్ల తాలూకా నుండి విభజించబడి నూతనంగా ఏర్పడిన ప్

స్వచ్ఛ వీరన్నపాలెం

Image
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది అక్షర సత్యం. వనం లేకపోతే మనం లేము. భూతాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి వృక్షాలు ఇతోధికంగా సహాయపడతాయి. అడ్డం వచ్చిందనో ,ఆదాయం రావటంలేదనో అడ్డదిడ్డంగా చెట్లను తొలిగించే అలవాటు వల్ల నేడు సమాజానికి అనేక ఇక్కట్లు వాటిల్లుతున్నాయి. వర్షాలు తగ్గాయి. ఎండలు మండుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగింది. ఆరోగ్యానికి ఆపద పొంచియుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే నివారణోపాయం. అదే నీడను ఇచ్చే చెట్లను విరివిగా పెంచటం,వాటిని సంరక్షించుకోవటం. సామాజిక సృహతో ప్రతి వ్యక్తి దీనికి తోడ్పాటు అందించాలి. స్వచ్ఛ వీరన్నపాలెం కార్యక్రమం లో భాగంగా పచ్చదనం కొరకు వీరన్నపాలెం గ్రామంలో చెట్లను పెంచే కార్యక్రమాన్నికొమల ట్రస్ట్ చేపట్టింది. పర్యావరణం ,పారిశుద్ధ్యం పరిరక్షించుదాం మన ఊరు పరిశుభ్రతే మన ఆరోగ్య రక్షణా సూత్రం స్వచ్ఛందంగా సేవ చేద్దాం రండి 12 సెప్టెంబర్ 2021 ఆదివారం , ఉదయం 7గం. లకు కొత్త చెరువు వద్ద మొక్కలు సంరక్షించే కార్యక్రమం. కన్వీనర్ - శ్రీమతి కొల్లా రత్నకుమారి

రిపబ్లిక్ దినోత్సవం - విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

Image
ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15న కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1926-2017)  జ్ఞాపకార్థం వారి అర్ధాంగి శ్రీమతి అలివేలు మంగమ్మ, కుమారుడు రాఘవేంద్రరావు గార్ల సహకారంతో కొమల చారిటబుల్ ట్రస్ట్ వారిచే వీరన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ నవ్యభారత విద్యాలయాలలో చదివే ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. కీర్తిశేషులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రారంభించిన ఈ బహుమతి కార్యక్రమం వారి మరణానంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కొమల ట్రస్ట్ వారు చేపట్టి దానిని కొనసాగిస్తున్నది. కరోనా కారణంగా స్వాతంత్ర దినోత్సవం నాటి కార్యక్రమం వాయదా పడినందువల్ల దానిని రిపబ్లిక్ దినోత్సవం 26 జనవరి,2021న, జరిపారు. ముందుగా జండా వందనం చేసి ఆతరువాత సభను జరిపి, చదువులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యర్దులు అందరికి జామంట్రీ బాక్స్ తో పాటు వివిధ రకాల పుస్తకాలను బహుమతులుగా అందించబడ్డాయి. వీటితోపాటు ప్రతి తరగతిలో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు శ్రీ పునుగుపాటి వెంకటేశ్వర రావు గారి కుమార్త సంధ్యారాణి కుటుంబ

కొడాలి వారి వంశ వృక్షం

Image
కొడాలి మల్లిఖార్జునరావు గారి వంశ వృక్షం   గోత్రం : శిఖినూళ్ల   కుటుంభ మూల పురుషుడు: సుందర రామయ్య   ( వీరి పూర్వీకుల వివరాలు అందుబాటులో లేవు )   స్థిర నివాసం: మోపర్రు (అమృతలూరు మండలం,గుంటూరు జిల్లా) A. సుందర రామయ్య కుమారులు  1. వెంకయ్య (సంతానం లేదు)     2. లక్ష్మయ్య (భార్య రత్తమ్మ) B. లక్ష్మయ్య,రత్తమ్మ గార్ల  కుమారులు   1. వెంకటప్పయ్య  (వెంకయ్య దత్త పుత్రుడు) 2.   సుందర రామయ్య (సంతానం లేదు) C.వెంకటప్పయ్య, రామానుజమ్మల సంతానం  1. వెంకట్రామయ్య (భార్య లక్ష్మీ నరసమ్మ- పాలడుగు వెంకట కృష్ణయ్య, వర లక్ష్మమ్మ గారి ప్రధమ కుమార్తె,పెద రావూరు) 2. లక్ష్మీ నారాయణ (భార్య నాగరత్తమ్మ) 3. పల్లెంపాటి నరసమ్మ (కుమార్త) D. వెంకట్రామయ్య, లక్ష్మీ నరసమ్మ ల  సంతానం   1. గోపాల కృష్ణయ్య (భార్య పద్మావతి) 2. మల్లిఖార్జున రావు (భార్య గోరంట్ల లక్ష్మీ దేవమ్మ) 3. ధనమ్మ (భర్త గోగినేని దేవయ్య) 4. రంగారావు ( భార్య ఉమాదేవి.ధనమ్మ కుమార్త) E. మల్లికార్జున రావు, లక్ష్మీ దేవమ్మల సంతానం స్థిర నివాసం: వీరన్నపాలెం (పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా)   1. రమేష్ బాబు (భార్య పొట్రు సుజాత, సంతానం వినయ్ కుమార్, హిమజా రాణి) 2. లతా మంజరి (భర్

కోవిడ్ -19 పై అవగహన సదస్సు

Image
కొమల చారిటబుల్ ట్రస్ట్ వారు ది. 16- 09- 2020 న ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామం లో కరోనా వ్యాధి నియంత్రణ జాగ్రత్తల గురించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామ వాలంటీర్లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు, హరిత హారం లో పనిచేసే కూలీలకు శ్రీ సోమేపల్లి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు అందించిన మాస్కులు మరియు శానిటైజర్లు ను కొమల ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి కొల్లా రత్న కుమారి గారు పంపిణి చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి కరోనా గురించిన అవగాహన కల్పించారు. రోజురోజుకి గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర రూపు దాల్చుతున్న ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతివారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సురక్షితమైన దూరాన్ని వ్యక్తులమధ్య పాటించాలని, తరుచు చేతులు శుభ్రం చేసుకోవాలని, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పోష్టికాహారం తీసుకొని వ్యాధి నిరోధక శక్తిని పెపొందించుకోవాలని రత్న కుమారి అందరిని కోరారు. ప్రజలలో నిర్లక్ష్యం వల్లే ఈ కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, అప్రమత్తం గా ఉంటే దాన్ని అరికట్టవచ్చు అని కొమల ట్రస్ట్ వీరన్నపాలెం కన్వీనర్ శ్రీ గోరంట్ల రాఘవేం